ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆస్ట్రేలియా హై కమిషనర్ శ్రీ ఫిలిప్ గ్రీన్ గారు బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ ఫిలిప్ గ్రీన్ గారిని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ శ్రీ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ శ్రీ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు.