తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ:
సిడ్నీ నార్త్ వెస్ట్ రీజియన్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్సడెన్ పార్క్ అండ్ మీలోంబా సబర్బ్స్ లో నివసిస్తున్న తెలుగు వారిని ప్రాతినిధ్యం వహిస్తూ సేవలందించే లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థగా మార్సడెన్ పార్క్ అండ్ మీలోంబా తెలుగు కమిటీ (MPMTC) ఏర్పాటు చేయబడింది.
వివిధ పండుగలను సాంప్రదాయ బద్దంగా అందరు కలసి ఒక కుటుంబంలా జరుపుకుంటూ, వివిధ సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తెలుగు వారి మధ్య బంధాలను, ఐక్యతను చాటుతూ , తెలుగు వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్శ్యంగా ఈ కమిటీ ముందుకు సాగుతుంది. పిల్లలు నృత్యం, పాటలు మరియు ఇతర ప్రత్యేక ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ప్రోత్సహిస్తుంది.
2023 , 2024 లో ఉగాది పండుగను చాల అట్టహాసంగా జరిపారు. ఇంకా వనభోజనాలు, ఫ్రెండ్షిప్ డే ,మాథెర్స్ డే సెలెబ్రేషన్స్, యోగ డే లాంటి కార్యక్రమాలు కూడా చేసారు.
ఇక ముందు వినాయక చవితి, బతుకమ్మ, హోలీ పండుగలను కూడా వైభవంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా, రాబోయే కాలంలో రక్తదానం, ఆస్ట్రేలియా క్లిన్ అప్ డే కార్యక్రమాలలో పాల్గొనాలని అనుకుంటున్నారు.
ఆ ప్రాంతంలో నివాసమున్న ప్రజలు ఎదుర్కుంటున్న విభిన్న సమస్యలను వాటి సంబంధిత అధికారులకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఈ కమిటీ చాలా కృషి చేస్తుంది.
ఈ కమిటీకి అనేకమంది నివాసితులు స్వచ్ఛంద సహకారం అందిస్తూ, విభిన్న పనులను సమన్వయపరచడంలో నిరంతరం సహాయపడుతూ, అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతున్నారు.
మార్స్డెన్ పార్క్ & మెలోన్బా తెలుగు కమ్యూనిటీ ఇంక్. (MPMTC Inc): 2024-2025 ఎగ్జిక్యూటివ్ కమిటీ. వారి వార్షిక కార్యక్రమాల కేలండర్ కూడా జతపరచబడింది
ప్రెసిడెంట్
|
రవికుమార్ సూరిసెట్టి |
జనరల్ సెక్రటరీ |
శ్రీనివాస దొడ్డా |
ట్రెజరర్ |
రామ హరిదాస్ |
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ |
నవీన్ పాటిబండ్ల |
కల్చరల్ సెక్రటరీ |
సింధు సప్తరుషి జోయిస్
|
ఎగ్జిక్యూటివ్ కమిటీ |
|
చంద్రశేఖర్ సెలగంశెట్టి |
హరి నీలి |
గాయత్రి గోసు |
శ్రీ దివ్య మెరుగు |
రమేష్ బగ్గం |
|
సలహా కమిటీ |
|
డాక్టర్ నీరజ్ దుగ్గల్ |
అనంత్ రాకేష్ పలక |
రవి చట్టి |
మునీష్ గిత్త |
mpmtelugucommunity@gmail.com
mpmtelugu కమ్యూనిటీ
శ్రీనివాస్ గొలగాని
ఎడిటర్
Telugu Paluku Australia