
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – బ్రిస్బేన్:
బ్రిస్బేన్, ఆస్ట్రేలియా: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ (TAQ) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. జనవరి 21, 2025, సాయంత్రం 6 గంటలకు MK Bower Cafe, Stones Corner, QLD లో జరిగిన ఈ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులు, తెలుగు కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొని, ప్రవాస భారతీయుల తో నేరుగా సమావేశమయ్యారు. ముఖ్య అతిథులుగా TPCC అధ్యక్షుడు శ్రీ బి. మహేశ్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు శ్రీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, క్రీడల కమిటీ చైర్మన్ శ్రీ కె. శివసేన రెడ్డి, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల వైస్ ఛాన్స్‌లర్ శ్రీ ఫహీము ద్దీన్ కురేషీ హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రవాస తెలుగువారికి, ముఖ్యంగా క్వీన్స్‌ల్యాండ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం లభించింది. సమాజ అభివృద్ధి, విద్యా అవకాశాలు, మైనారిటీల సంక్షేమం, క్రీడల ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చ జరిగింది.
ఈ సమావేశాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రాయోజకులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Top in Town, Balti, MK Bower Cafe, Birla Enterprises Pty Ltd, శ్రీకాంత్ రెడ్డి సద్దాం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశాయి.
అలాగే, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడంలో మాధవ రెడ్డి గుర్రం గారి సహాయం ఎంతో కీలకం కావడంతో ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, రాజశేఖర్ రెడ్డి మణ్యన్, శ్యామ్ చిలువేరు, సందీప్ చిత్రపు గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం ప్రవాస భారతీయుల సంఘీభావాన్ని పెంపొందించడంలో, ప్రభుత్వ అధికారులతో అనుసంధానం నెలకొల్పడంలో విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. TAQ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించి, తెలుగు సముదాయానికి మద్దతునివ్వాలని అభిప్రాయపడ్డారు.
మీడియా సంప్రదింపులు:
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ (TAQ)
📍 బ్రిస్బేన్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా
📩 contact@taq.com.au
—- శ్రీనివాస్ గొలగాని