తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ:
ఆస్ట్రేలియా జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేన విజయోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పోటీచేసిన అన్ని స్థానాలలోను గెలిచిన సందర్భంగా ఆస్ట్రేలియా దేశంలో, సిడ్నీలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలలోను మరియు 2 ఎంపి స్థానాలలోను గెలిచి 100 పర్సెంట్ స్ట్రైక్ రేటుతో చరిత్ర పుటల్లో నిలిచిపోయే విజయాన్ని కైవసం చేసుకున్నందుకు ఆస్ట్రేలియా జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ వేడుకకు ఆస్ట్రేలియా నలుమూలల నుండి సిడ్నీ నగరానికి జనసేన నాయకులు ఈ వేడుకకు హాజరవడం జరిగింది. సిడ్నీలో జరిగిన ఈ విజయోత్సవ వేడుకను జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళల మద్య కేకును కట్ చేసి విజయోత్సాహాన్ని అందరూ పంచుకున్నారు.
ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు జన సైనికుల పిల్లలు ఆటపాటలతో అందరినీ అలరించారు, ఒక యంగ్ కపుల్స్ డ్యాన్సులతో చిరంజీవి పాటలు, పవన్ కళ్యాణ్ గారి పాటలతో స్టేజి దద్దరిలేలాగా, అదిరిపోయేలాగా, ఊగిపోయేలాగా, ఉత్సాహంగా డాన్సులు వేసి అందరి చేత ఈలలు కేకలతో మంచి కనువిందు చేశారు. కార్యక్రమంలో జనసేన పాటలు, జనసేన అధినేత స్పీచ్ లను ప్లే చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు వీడియో మెసేజ్ ద్వారా తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పది సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు కష్టపడిన కష్టాన్ని చేసిన సేవల్ని గుర్తించి ఒక అమూల్యమైన మెమొంటోతో సత్కరించుకున్నారు. గాజు గ్లాసు బహుమతిగా వచ్చిన ప్రతి ఒక్క జనసైనికుడికి వీర మహిళలకి ఈ విజయోత్సవ సభ గుర్తుగా ఒక గాజు గ్లాసు బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తాడెపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జూమ్ కాల్ ద్వారా హాజరయ్యి తమ అమూల్యమైన సందేశాన్నివ్వడం జరిగింది. తమలో ఉత్సహాన్ని నింపిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు ఆస్ట్రేలియా జనసేన తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి , శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంట్ సభ్యులు జూమ్ కాల్ ద్వారా తమ సమూల్యమైన సందేశాన్ని మన జన సైనికులకు వీర మహిళలకు అందజేసి అందర్నీ ఉత్సాహపరిచారు అందుకుగాను , శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఆస్ట్రేలియా జనసేన తరఫున అందరూ ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియా జనసేన కన్వీనర్లలో ఒకరైన శ్రీ శశిధర్ కొలికొండ్ల గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇండియా నుంచి జూమ్ కాల్ లో జన సైనికులను వీర మహిళలను ఉత్తేజపరిచే విధంగా ఉత్సాహపరిచే విధంగా సందేశాన్ని ఇచ్చి మాట్లాడటం జరిగింది.
రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ నాయకత్వంలో 100% ప్రజాసేవ చేసి, జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని జనసైనికుల్లో ఉత్తేజం నింపారు. ఇదే ఇన్స్పిరేషన్ తో మరింత కష్టపడి పనిచేస్తామని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి మరియు జనసేన అధినేతను పిఠాపురంలో గెలిపించిన పిఠాపురం ప్రజలకు మరియొకసారి ధన్యవాదాలు తెలిపారు. జన సైనికుడి & వీర మహిళల స్థాయిని పెంచి, తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చి, గెలుపుకి ఒక రాజ మార్గము వేసి, ఎలా కష్టపడాలో, ఎలాంటి భావాలు కలిగి ఉండాలో ఆదర్శవంతంగా యువతకి చూపించి అదే మార్గంలో నడిచి విజయకేతనం ఎగురవేసి చరిత్రపుటల్ని రాజకీయ విశ్లేషకుల ఊహకు అందని విజయకేతనాన్ని ఎగరవేసి రాబోయే తరాల వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా నిలిచిన జనసేన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ విజయోత్సవ సభ ద్వారా జనసేన ఆస్ట్రేలియా తరపున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపారు.
మా యాంకర్లు అర్చన గారు మరియు శాంతి గారు, మా వాలంటీర్లు మరియు ప్రదర్శకులు లేకుండా మా కార్యక్రమాలు ఇంత విజయవంతం అయ్యేవి కావు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చివరిగా ఆస్ట్రేలియా జనసేనను ఇప్పటిదాకా ముందుండి నడిపించిన శ్రీ రవి మిర్యాల గారిని మేనేజ్మెంట్ వారు శాలువాతో సత్కరించుకున్నారు. ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సభకు విచ్చేసిన జన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు ఎన్నారై టిడిపి కార్యకర్తలకు టిడిపి నాయకులకు మరియు బిజెపి నాయకులకు బిజెపి కార్యకర్తలకు జనసేన ఆస్ట్రేలియా తరపున ధన్యవాదాలు తెలిపారు.
జనసేన 2024వ సంవత్సర విక్టరీ సెలబ్రేషన్స్ లో పాల్గొని విజయవంతం చేసిన జనసైనికులకు & వీర మహిళలకు జనసేన ఆస్ట్రేలియా తరపున జనసేన ఎన్నారై కన్వీనర్స్ శ్రీ రవి మిరియాల, శ్రీ రాజేష్ మల్ల, మరియు
కో-కన్వీనర్స్ అయినటువంటి
శ్రీ గాజుల మురహరి నాయుడు,
శ్రీ కిషోర్ రంగా, శ్రీ పవన్ వజుల ,
శ్రీ జగదీష్ హరిదాస్ , శ్రీ శ్రీకాంత్ దున్న, శ్రీ వెంకట్ పోటం శెట్టి, శ్రీ పవన్ సింగంశెట్టి, శ్రీ తిరు మేడిశెట్టి,
శ్రీ మనోహర్ మలిశెట్టి, శ్రీ భాను కొమ్మిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
జనసేనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న Asset Point Group, సితార బిర్యానీ పాయింట్, నీవి హోమ్స్, సనత్ సర్వీసెస్, Arvensys, ManVision, అమ్మ పిండి వంటలు, స్వాగత్ బిర్యానీ హౌస్, రాజా ఎలమంచి టాక్స్ కన్సల్టెంట్ , Vaaraahi Mangoes, వెంకట కండిపూడి టాక్స్ కన్సల్టెంట్, A1F సర్వీసెస్, Kavanii, EnrichIT, ProgrusIT వంటి మా స్పాన్సర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
— గాజుల మురహరి నాయుడు