గురు పూర్ణిమ సందర్భంగా స్థానిక కాసిల్ హిల్ హార్వే లొవె పెవిలియన్ లో షిరిడి సాయిబాబా వ్రతంతో గురుపూర్ణిమ వేడుకలు నిర్వహించారు పంచామృత అభిషేకాలు, సామూహిక గురు పాదుకా పూజా కార్యక్రమాలు, సామూహిక సాయి సత్యవ్రతా లు,, సామూహిక సాయిబాబా వ్రతం, అన్నప్రసాద కార్యక్రమాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా జరిగాయి.
ఈ కార్యక్రమం శ్రీ శివ జ్యోతి దేవాలయం వారి అద్వర్యంలో జరిగాయి. శివ జ్యోతి దేవాలయం ట్రస్ట్ డిసెంబరు 4, 2010న, కొంతమంది ఆధ్యాత్మిక భావాలు, ధార్మిక ప్రేరేపిత స్థానికులచే నెల నెలా బలపడుతూ తన ప్రస్తుత రూపమైన శ్రీ శివజ్యోతి టెంపుల్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విస్తృత హిందూ సమాజం యొక్క పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి మరియు సనాతన ధర్మ సూత్రాల ప్రకారం ఆచారాలను నిర్వహించడానికి SSJT అధికారికంగా లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థగా 7 ఆగస్టు 2014న విలీనం చేయబడింది.
సుమారు 150 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి ప్రపత్తులతో సాగింది.