తెలుగు పలుకు ఆస్ట్రేలియా – అడిలైడ్:
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెల రోజులు కావస్తున్న విదేశాల్లో విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో ప్రజా కూటమి విజయోస్తవాలు పేరిట ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఇటీవల మరణించిన అక్షర యోధుడు రామోజీరావు కి ఘనంగా నివాళులు అర్పించి రెండు నిముషాలు పాటు మౌనం పాటించారు. రామోజీరావు లాంటి వ్యక్తి తెలుగువాడిగా పుట్టడం తెలుగు వారు చేసుకున్న అదృష్టం అని కొనియాడారు.తెలుగు నియంత ను నేలకు కరిపించడం కోసం చివరి క్షణం వరకు అక్షర పోరాటం చేసిన యోధుడు చిరస్మరణీయలు రామోజీ రావు అని NRi లు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.
కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి NRI లుగా తమ వంతు సహకారం ఉంటుంది అని తెలిపారు. ఈ సందర్బంగా పలు సంస్కృతిక కార్యక్రమాలు తో కూటమి అభిమానులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. మహిళలు చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
సిడ్నీ యువ చిత్రకారిణి కుమారి సుమ గొలగాని చేతితో గీసి వేసిన చంద్రబాబు చిత్రపటాన్ని వేలం నిర్వహించారు. దీనిని మెల్బోర్న్ వాసి గోగినేని బాబు 35000(550$)రూపాయలకు దక్కించుకున్నారు.
గత రెండు ఏళ్ల నుంచి అడిలైడ్ నగరం లో తెలుగుదేశం అభిమానులు అందించిన సహకారానికి, సమయానకి దక్షిణ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నవీన్. నేలవల్లి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియపర్చారు.
— నరేంద్ర కుక్కపల్లి