తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ : అట్లాంటా, USA లో, శ్రీ సీతా రామ టెంపుల్ నిర్మాణ సన్నద్ధతలో భాగంగా శ్రీ పద్మనాభాచార్య వారు తలపెట్టిన బృహత్కార్యక్రమం శ్రీ రామ పరివార ఉత్సవ విగ్రహ ఖగోళ యాత్ర. అయోధ్య లో మొదలు అయ్యు భారత దేశానికి తూర్పున ఉన్న కాంబోడియా మీదుగా ఆగ్నేయ దిగ్భాగాన ఉన్న సిడ్నీ నగరం వేంచేసిన అర్చక బృందము భద్రాద్రి ప్రధాన అర్చకులు శ్రీ సీతారామాచారి గారి ఆధ్వర్యం లో సీతా రామ కళ్యాణం మరియు శాంతి హోమం నేత్ర పర్వము గా నిర్వహించారు. Hindu Council of Australia (HCA) and Dharma Enlightenment Vedic Association of Australia (DEVAA) సంస్థల ప్రతినిధులు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు శ్రీ సాయి పరవస్తు, శ్రీ కోడూరు రామమూర్తి, శ్రీ పవన్ వఝల, శ్రీ జగదీష్ హరిదాసు, శ్రీ రామ్ వేల్ మరియు SVT (Sri Venkateswara Temple) ఆలయ కమిటీ సభ్యులు శ్రీ ప్రవీణ్ చల్లా, శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ సంపూర్ణ సహకారం తో , భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం దిగ్విజయం గా జరిగింది. అర్చక బృందం సత్కారాన్ని అందుకుని , ఖగోళ యాత్ర లో భాగం గా సిడ్నీ నుంచి పయనమై సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఐస్ లాన్డ్, జపాన్ పర్యటించి అష్ట దిక్కులలో శాంతి కళ్యాణం, హోమం జరుపుకుని, భద్రాచలం చేరుకుంటారు. అట్లాంటా లో శ్రీ సీతారామ భద్రాద్రి ఆలయ నమూనా లో 33 ఎకరాలలో నిర్మాణం జరగనున్న శ్రీ సీతారామ మందిరం భవ్యం గా జరగాలని భక్తులు ఆకాంక్షించారు. దేశ, విదేశాలలో సనాతన ధర్మ పరిరక్షణకు ధర్మ స్వరూపుడైన శ్రీ రామ చంద్ర ప్రభువు ఆశీస్సులు రాబోవు తరాలకు కూడా కలగాలని ప్రార్ధించారు.