ఈ సంవత్సరం మార్సడెన్ పార్క్ తెలుగు కమ్యూనిటీ Inc (MPTC ) వినాయక చవితి ఉత్సవాల అంగరంగ వైభవంగా నార్త్‌బోర్న్ పబ్లిక్ స్కూల్‌లో సెప్టెంబర్ 08 న జరిగింది.ఈ వేడుకలకి మార్స్డెన్ పార్క్, మెలోన్బా మరియు కోల్బీ వాస్తవ్యులు దాదాపు 150 కుటుంబాలు విచ్చేసారు. శ్రీ శ్రీనివాస్ శర్మ గారి అధ్వర్యంలో 20 కి పైగా దంపతులచే పూజని జరిపించారు.అంటే కాకండా మార్స్‌డెన్ పార్క్‌లో చిన్నారులు వినాయకుడి ఆరతి (పాటలు పాడారు), గణేశ స్తుతి (భరతనాట్యం ప్రదర్శన), గణేశ కుబేర కథను ప్రదర్శించారు.మరి ఈ వేడుకలలో పాల్గొని వారి విలువయిన సమయం ని కేటాయించిన బ్లాక్ టౌన్ మేయర్ బ్రాడ్ బంటింగ్ గారికి మార్స్డెన్ పార్క్ తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేసారు.
సాంకేతిక కార్యక్రమలు అయిన తర్వాత సిడ్నీ శివగర్జన వారి ప్రదర్శనతో ఆ గణేశుడు తృప్తి చెందారు. అందరికి వల్ల గల్లీ గణేశుడు మరియు ఇండియాలో చిన్నపాటి గుర్తులను గుర్తుచేసారు. యే గణేశుడి వేడుక అయినా పూర్తి అయ్యేది లడ్డు వేలంతోనే. MPTC వారు నిర్వహించిన ఈ లడ్డూ వేలంలో పాల్గుణి అందరికన్నా ఎక్కువగా పాడినవారు శ్రీమతి అనూష బండారపు గారు. MPTC వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ (నాన్ ప్రాఫిట్ ప్రోగ్రాం) వారు కూడా వచ్చి వల్ల చిన్నారులుతో మాటలు కూడా పాడారు. అంతే కాకుండా మార్స్‌డెన్ పార్క్‌లో రాబోయె శ్రీ వేంకట కృష్ణ దేవాలయం వారు విచ్చేసి దేవాలయం గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ఈ వివిధ కార్యక్రమల తర్వత మహాప్రసాదం తో కార్యక్రమం ముగిసింది. వచ్చినవారందరికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, స్పాన్సర్స్ కి మరియు చంద దారులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము.