ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన బృంద సభ్యులు సాయి రోహిత్, సుధీర్, మణి, కిషోర్, సతీష్, శ్రీరామ్, సూర్య లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో జనసేన, టీడీపీ, బీజేపీ అభిమానులు హాజరయ్యారు.
కార్యక్రమంలో రాజకీయ సిద్దాంతాల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ సిద్దాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చేసిన ప్రసంగాలు ప్రతి ఒక్కరినీ ప్రేరేపించాయి.
అనేక మంది ప్రజలు ఈ విజయోత్సవంలో పాల్గొని ఆనందంతో మునిగిపోయారు. ఉత్సవం విజయవంతంగా ముగిసి, కూటమి పార్టీలకు మరింత బలం చేకూర్చేలా నిలిచింది.