మను దేవన గారు లేబర్ పార్టీ తరఫునుంచి కంబర్ ల్యాండ్ కౌన్సిల్లో గ్రేస్టెన్స్ వార్డు నుంచి లేబర్ కాండిడేట్ గా కౌన్సిల్ ఎలక్షన్స్ లో నిల్చుకున్నారు. మను దేవన గారు మాస్టర్ ఇన్ బిహేవియర్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ చదివి ఉన్నారు. వీరు గత 20 సంవత్సరములుగా ఆస్ట్రేలియాలో ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎడ్యుకేటర్ గా ఉచిత సేవలు అందిస్తున్నారు. వీరి వృత్తిలో భాగంగా డొమెస్టిక్ వైలెన్స్, మ్యారిటల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, పేరెంటింగ్ ఇష్యూస్ సంబంధించిన విభాగంలో వారు ఉచిత సేవలను అందిస్తూ ఉన్నారు ఆమె విస్తృతమైన అనుభవం మరియు విద్య సామర్థ్యం ఆమెకు ప్రత్యేకమైన నాయకత్వ నైపుణ్యాలు మరియు సామర్థ్యాన్ని అందించాయి గ్రేస్ టెన్స్ వార్డులో మల్టికల్చర్ కమ్యూనిటీ ఉన్న ప్రజలు నివసిస్తున్నారు వారి వారి సంస్కృతిని కాపాడుకుంటూనే వారికి వారి కుటుంబాలకు తగిన విధంగా సేవలు అందించడానికి మను దేవన గారు మీ మద్దతు కోరి మీ ముందుకు వస్తున్నారు ఆమె అనుభవం మరియు మను దేవన గారికి సమాజం పట్ల ఉన్న బాధ్యత అవగాహన తోటి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల అవసరాలను తెలుసుకొని వారికి అనుగుణంగా సేవలు అందించడానికి రాబోయే ఎలక్షన్లో మీ ఓటు వేసి మను దేవన గారిని గెలిపించాలని కోరుతున్నారు.
మను దేవన్న గారి గురించి మరింత సమాచారం మీరు తెలుసుకొనవలెననిన వారి వెబ్సైట్ని సందర్శించగలరు.