వేలం విజేత శ్రీ ప్రవీణ్ రెడ్డి, శ్రీమతి శిరీష & చి|| సంజీవ్:
సాయి బాబా పూజ సందర్భంగా ఆలయ పనుల కోసం యువ మహిళా విద్యార్థి కళాకారిణి కళా కృతి చారిటీ కోసం వేలం వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సాహవంతులైన చాలా కుటుంబాలు పాల్గొన్నారు, వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆలయ నిర్మాణానికి మద్దతుగా ఉపయోగించబడుతుంది అని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ సందర్భం జరిగిన వేలం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 1116 $ వద్ద మొదలైన పాట చాలా త్వరగానే $2000 వైపు సాగింది. ఒక సమయం తరువాత పూజారి మణికంఠ గారు, రామ్ పులిపాటి గారు, సూర్య వెచ్చ గారు, విద్యాసాగర్ పులపర్తి గారు, శ్రీనివాస్ కానూరు గారు, జై శంకర్ గారు, ప్రవీణ్ రెడ్డి గారు కొనసాగారు. చివరకు ప్రవీణ్ గారు శ్రీమతి శిరీష గారు $4751 కు ఆ పెయింటింగ్ ను ఒక గొప్ప ఆలయనిర్మాణం కార్యక్రమానికి మద్దత్తు ఇస్తూ చేజిక్కించుకున్నారు. శ్రీ ప్రవీణ్ రెడ్డి గారు వెస్ట్రన్ సిడ్నీ లో తెలుగు వారి ఎంతో ప్రాచుర్యం పొందిన, గొప్ప గుర్తింపు గల రియల్ ఎస్టేట్ ఏజెంట్. వేలం ముగిసిన తరువాత హాల్ చప్పట్లతో సాయి రామ్ నినాదాలతో మరు మ్రోగిపోయింది.
ఈ కృతి చిత్రకారిణి కుమారి సుమ గొలగాని ఆస్ట్రేలియా కళా ప్రపంచంలో ఎదుగుతున్న తార
చిన్న వయస్సు నుంచే చిత్రకళ పట్ల గొప్ప ఆసక్తి కలిగిన ఈ యువ కళాకారిణి, అతి చిన్నవయసు సుమారు 13 ఏళ్ళ నుండి ఆమె తెలుగు పలుకు పత్రికకు సుమారు 4 ఏళ్ల పాటు ముఖచిత్రకారిణిగా వ్యవహరించింది. ఆమె ప్రత్యేక శైలి, జీవంతమైన రంగులు మరియు సంక్లిష్ట వివరాలతో ప్రఖ్యాతి పొందుతోంది. కమిటి మీటింగ్ లో శ్రీమతి పుష్ప కాకాని గారు ఇచ్చిన ప్రతిపాదనకు సాకులంగా స్పందించి కమిటీ ఇచ్చిన 10 రోజుల గడువులో సుమ తన సోదరి రోషన్ గొలగాని తండ్రి శ్రీనివాస్ గొలగాని సహకారంతో ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. ఈ సారి సాయి బాబా పూజ సందర్భంగా నిర్వహించిన ఈ వేలం, ఆమె వికాసవంతమైన కెరీర్‌లో మరో మైలురాయి సాధించిందని చెప్పవచ్చు. సుమకు సొంతగా ఒక ఆర్ట్ స్టూడియో ఉంది, మునుపు కూడా ఆమె కృతులు అనేక సందర్భాలలో వేలం వెయ్యబడి మొత్తంగా $25000 పైచిలుకు వివిధ సంస్థలకు చారిటీ అమౌంట్ తేవడంలో కెలక పాత్ర వహించింది.
2022 జనసేన కార్యక్రమం లో నాగబాబు చేతుల మీదుగా జరిగిన వేలం లో రామ్ పులిపాటి గారు & శశి గారు కాన్బెర్రా $20,000 పవన కళ్యాణ్ బొమ్మను సొంతం చేసుకున్నారు.
2023 ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వేలం వేసిన చిత్రం $2000 తెచ్చిపెట్టింది. దానిని నవీన్ పాటిబండ్ల & వాసవి కొంగర దంపతులు చేజిక్కిన్చుకున్నారు.
2024 అడిలైడ్ తెలుగు దేశం విజయోత్సవ వేడుకలలో చంద్ర బాబు గారి చిత్రాన్ని బాబు గోగినేని గారు $550 డాలర్లకు సొంతం చేసుకున్నారు.